వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాలు అభివృద్ధి : మంత్రి ధర్మాన

జల ఆకాంక్షల మేరకే ఏపీలో పాలన సాగుతోందని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు.

Update: 2020-01-19 13:29 GMT

ప్రజల ఆకాంక్షల మేరకే ఏపీలో పాలన సాగుతోందని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరుగుతుందని కృష్ణదాస్ తెలిపారు. రాజధాని తరలింపును అడ్డుకుంటున్న చంద్రబాబు, పవన్‌ కళ్యాన్‌పై మంత్రి తీవ్ర విమర్శలు చేశారు.

మరోవైపు చంద్రబాబుపై కూడా విమర్శలు కురిపించారు ధర్మాన. ఏపీ అభివృద్ధికి లక్ష కోట్ల రాజధాని అవసరం లేదన్నారు. సాగునీటి ప్రాజెక్టులు లక్ష కోట్లు కేటాయిస్తే రాష్ట్రం శాశ్వతంగా సుభిష్టంగా ఉంటుందని అన్నారు. చంద్రబాబు అసత్యాలు చెప్పడం మని నరసన్నపేట నియోజవర్గం నుంచి పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. సీఎం వైఎస్ జగన్ భవిష్యత్తులో అన్ని ప్రాంతాలు అభివృద్ధి లక్ష్యంతో పని చేస్తున్నారని, రాష్ట్ర ప్రజలు దానిని స్వాగతీస్తు్న్నారని పేర్కొన్నారు. చంద్రబాబు మద్దతుతోనే మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అమరావతి దీక్షలను పేరుతో టీడీపీ దొంగ దీక్షలు చేస్తుందని మాజీ ఎంపీ కిల్లి కృపారాణి విమర్శించారు. అధికార వికేంద్రీకరణకు ప్రజలు మద్దతు పలుకుతున్నారని తెలిపారు. 

‎‎

Tags:    

Similar News