ఇంగ్లిష్ మీడియం.. జగన్ సర్కారుకు హైకోర్టు షాక్

జగన్ సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాసంవత్సరం నుంచి ప్రాథమిక విద్యను ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి చేయాలని నిర్ణయం తీసుకోవడంపై షాక్ ఇచ్చింది.

Update: 2020-01-28 10:21 GMT
AP HIGH COURT FILE PHOTO

 జగన్ సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాసంవత్సరం నుంచి ప్రాథమిక విద్యను ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి చేయాలని నిర్ణయం తీసుకోవడంపై షాక్ ఇచ్చింది. విద్యార్థులు తమకు ఇష్టమైన మాధ్యమంలో విద్యా్భ్యాసం చేసుకునే హక్కు ఉందని న్యాయస్థానం తెలిపింది. నిర్బంధ బోధించడం కుదరదని తేల్చి చెప్పింది. ఇంగ్లీష్ మీడియం విద్యపై చట్ట బిల్లు సవరణ శాసనసభ ఆమోదించింది. కాగా.. శాసన మండలి దానికి సవరణలు సూచించారు..కాగా.. రైటు టూ ఇంగ్లిష్ మీడియం విద్యావిధానం తీసుకొచ్చామని అసెంబ్లీ సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

తెలుగు మీడియాన్ని ప్రభుత్వ పాఠశాల్లో తొలగించి ఆంగ్ల మాధ్యమంతో బోదన సరికాదంటూ.. శ్రీనివాస్ అనే వ్యక్తి ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు. విద్యార్థులను ఇంగ్లిష్ మీడియంలోనే చదవాలని నిర్బంధించలేమని స్పష్టం చేసింది. అలా చేస్తే సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధమని తెలిపింది. ఇంగ్లిష్‌ మీడియం పుస్తకాల ముద్రణ, శిక్షణ తరగతులు చేపడితే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించింది .

అధికారుల నుంచే ఖర్చులు కూడా రాబడతామని కోర్టు తెలిపింది. ఇక హైకోర్టు దీనికి సంబంధించిన తుదపరి విచారణ ఫిబ్రవరి 4కు వాయిదా వేసింది. అఫిడవిట్ దాఖలు చేయాలని‎ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. అఫిడవిట్ దాఖలు చేయలేని పక్షంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోర్టుకు హాజరుకావాలని సూచించింది.


Tags:    

Similar News