Chittoor SP: లోకేష్ పాదయాత్రకు అనుమతి.. నిబంధనల లోబడే జరగాలి..
Nara Lokesh: టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టబోయే యువ గళం పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చిత్తూరు ఎస్పీ రిషాంత్ స్పష్టం చేశారు.
Chittoor SP: లోకేష్ పాదయాత్రకు అనుమతి.. నిబంధనల లోబడే జరగాలి..
Nara Lokesh: టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టబోయే యువ గళం పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చిత్తూరు ఎస్పీ రిషాంత్ స్పష్టం చేశారు. సోమవారం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. నిబంధనలకు లోబడే పాదయాత్ర జరగాలని నారా లోకేష్, టీడీపీ క్యాడర్‌కు సూచించారు. చట్టప్రకారం అందరికి ఎలా పర్మిషన్ ఇస్తామో.. లోకేష్ పాదయాత్రకు కూడా అలానే ఉంటుందని చెప్పారు. నిబంధనలకు లోబడే పాదయాత్ర అనుమతి ఉంటుందని తెలిపారు. పాదయాత్రను ఆపాలనే ఉద్దేశం కూడా తమకు లేదని తెలిపారు. అనవసరంగా కొంత దుష్ప్రచారం జరుగుతుందని అన్నారు.