అవినీతి నిర్మూలనపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Update: 2019-11-21 14:17 GMT
సీఎం జగన్

ఏపీలో అవినీతిని రూపుమాపడానికి కేసుల విచారణలో సాంకేతిక సహకారం తీసుకోవడనికి కీలక నిర్ణయం తీసుకుంది. అవినీతి నిర్మూలనకు అహ్మదాబాద్ ఐఐఎంతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. సీఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఐఐఎం(ఎ) ప్రొఫెసర్ నారాయణస్వామి, ఏసీబీ చీఫ్ విశ్వజిత్ ఒప్పంద పత్రాలపై సీఎం జగన్ సమక్షంలో సంతకాలు చేశారు.

ఐఐఎం బృందం వచ్చే ఏడాది ఫిబ్రవరి మూడో వారం వరకు ఈ అంశంపై అధ్యయనం చేసిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక అందజేయనుందని తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో సీఎస్ నీలం సహాని, డీజీపీ గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు.




Tags:    

Similar News