టీడీపీ ఎంపీకి షాకిచ్చిన ఏపీ ప్ర‌భుత్వం... అమ‌ర్ రాజాకు కేటాయించిన భూములు వెన‌క్కి

Update: 2020-06-30 11:30 GMT

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లాలోని అమర్‌రాజా ఇన్‌ఫ్రాటెక్ కు‌ సంబంధించి 253 ఎకరాల భూమిని వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమర్‌రాజా ఇన్‌ఫ్రాటెక్ ఎంపీ గ‌ల్లాజ‌య‌దేవ్ సంబంధించిన సంస్థ అని తెలుస్తోంది. ప్రభుత్వం 483.27 ఎకరాల్లో 253.61 ఎకరాలు వినియోగించ లేదన్న సర్కార్ పేర్కొంది. గత పదేళ్లుగా 229.66ఎకరాలు మాత్రమే వినియోగించారన్న ప్ర‌భుత్వం.. 483.27 ఎకరాల్లో 253.61 ఎకరాలు వినియోగించ లేద‌ని స‌ర్కార్ ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. అగ్రిమెంట్‌లో చెప్పిన విధంగా రూ.2,100 కోట్ల పెట్టుబడిలొ స్థానికుల‌కు ఉద్యొగాలు కల్పిస్తున్నామ‌ని హామీ ఇచ్చి...20 వేల ఉద్యోగాల కల్పించ‌లేద‌ని ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. కేవ‌లం 4,310 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారని ప్ర‌భుత్వం పేర్కొంది.

Tags:    

Similar News