నేడు ఢిల్లీకి సీఎం వైఎస్‌ జగన్‌.. షెడ్యూల్ ఇదే..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు(సోమవారం) ఢిల్లీకి

Update: 2019-10-21 02:10 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు(సోమవారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ విషయాన్నీ సీఎంఓ అధికారులు వెల్లడించారు. నేడు ఉదయం 10.05 గంటలకు విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరనున్న జగన్.. మ.12.05 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటారు.

అక్కడ కొందరు కేంద్ర మంత్రులను కలుస్తారు. ఈ సందర్బంగా రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలు, సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లనున్నారు. పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్, త్వరలో చేపట్టనున్న పనులపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో చర్చిస్తారు.. పెండింగ్ నిధులను వెంటనే విడుదల చెయ్యాలని కోరనున్నారు. అలాగే పవర్ పర్చేజ్ అగ్రిమెంటు సమీక్షకు సంబంధించి ఆర్కే సింగ్ తోను సమావేశం కానున్నారు. అంతేకాదు షెడ్యూల్ 9,10 కు సంబంధించి.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో చర్చిస్తారు. కాగా, సీఎం సోమవారం రాత్రికి ఢిల్లీలోనే బసచేస్తారు. 22వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి నేరుగా విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడ అరకు ఎంపీ గొడ్డేటి మాధవి వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు. అనంతరం రేపు రాత్రి 9 గంటల ప్రాంతంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.

కాగా, నేడు(సోమవారం) ఉదయం.8గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరగనున్న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరవుతారు. ఈ సందర్బంగా అమరులైన పోలీసులకు ఆయన శ్రద్ధాంజలి ఘటించనున్నట్టు సమాచారం.

Tags:    

Similar News