'వైఎస్సార్‌ వాహన మిత్ర' పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌

'వైఎస్సార్‌ వాహన మిత్ర' పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌ 'వైఎస్సార్‌ వాహన మిత్ర' పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌

Update: 2019-10-04 05:44 GMT

ఏపీలో ఆటో, క్యాబ్‌, కార్లు నడుపుకుని జీవించే పేద డ్రైవర్లకు ఆర్థిక భద్రత కల్పించడం కోసం ఏటా రూ. 10 వేలు అందించే 'వైఎస్సార్‌ వాహనమిత్ర' పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం సహా పలువురు మంత్రులు హాజరయి పధకాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మాట ఇచ్చిన చోటు నుంచే పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. ఏలూరులో ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆటో డ్రైవర్ల కష్టాలు చూసి చలించి ఇదే ఏలూరులోనే 'వైఎస్సార్‌ వాహనమిత్ర' పధకాన్ని ప్రారంభించామని చెప్పారు.

ఇది ప్రతి ఏడాది అమలవుతుందన్న సీఎం ప్రతి పేద సొంత వాహనదారుడికి ఐదేళ్లల్లో రూ.50 వేలు అందుతాయన్నారు. ఈ డబ్బును వాహనాలకు ఫిట్‌నెస్‌, బీమా, మరమ్మతుల కోసం వినియోగించుకోవాలాని సూచించారు. ఇంకా ఎవరైనా పొరపాటున దరఖాస్తు చేసుకొని పక్షంలో ఈనెల ఆఖరు వరకు సమయం ఉంటుందని దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. కాగా రాష్ట్రంలోని ఒక లక్షా 75 వేల మంది వాహనదారులకు ఈ సహాయం అందింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 175 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. 

Tags:    

Similar News