రైతు భరోసా పథకం ప్రారంభోత్సవానికి ప్రధానిని ఆహ్వానించిన ముఖ్యమంత్రి

రైతు భరోసా పథకం ప్రారంభోత్సవానికి ప్రధానిని ఆహ్వానించిన ముఖ్యమంత్రి రైతు భరోసా పథకం ప్రారంభోత్సవానికి ప్రధానిని ఆహ్వానించిన ముఖ్యమంత్రి

Update: 2019-10-05 15:32 GMT

ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. శనివారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న సీఎం.. పలువురు ఎంపీలతో కలిసి సాయంత్రం 4:30 గంటలకు మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఈ నెల 15న ప్రారంభమయ్యే ప్రతిష్టాత్మక 'రైతు భరోసా' పథకం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా ప్రధాని మోదీని ఆహ్వానించారు.



 









కృష్ణా - గోదావరి జలాల అనుసంధానం కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. అలాగే వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేకంగా అందించే నిధులను విడుదల చేయాలని కోరారు, ఇక కీలకమైన పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ. 800 కోట్ల నిధుల ఆదా వివరాలను ప్రధానికి సీఎం జగన్‌ వివరించారు. అంతేకాకుండా ఏపీకి ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీలను నెరవేర్చాలని కోరినట్టు తెలుస్తోంది. ప్రధానితో భేటీ అనంతరం ఢిల్లీ విమానాశ్రయం నుంచి సీఎం జగన్‌ విజయవాడకు వచ్చేశారు. 



 


Tags:    

Similar News