సీఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ సస్పెండ్
IPS Sunil Kumar suspended by ap govt: సీఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ సస్పెండ్
సీఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ సస్పెండ్
AP CID former chief Sunil Kumar suspended: సీఐడి మాజీ చీఫ్, ఐపీఎస్ సునీల్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజును వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వంలోని పెద్దల ఆదేశాల మేరకు సునీల్ కుమార్ ఆయన్ను వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో సునీల్ కుమార్ విచారణ ఎదుర్కుంటున్నారు. దీనికితోడు సునీల్ కుమార్ 2020-24 మధ్య కాలంలో పలు సందర్భాల్లో ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లి వచ్చినట్లు ప్రభుత్వం గుర్తించింది.
ఇదే విషయమై రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా నేతృత్వంలోని కమిటీ విచారణ కూడా జరిపింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే తాజాగా ఏపీ సర్కారు సునీల్ కుమార్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో అప్పటి సీఐడీ అదనపు ఎస్పీగా ఉన్న విజయ్ పాల్ కూడా ఇదే కేసులో విచారణ ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. కస్టడీలో ఉన్న సమయంలో విజయ్ పాల్ తనను చిత్రహింసలకు గురిచేసి, హత్యాయత్నానికి కూడా యత్నించారని రఘురామ కృష్ణరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విజయ్ పాల్‌పై గుంటూరు నగరంపాలెం పోలీసు స్టేషన్‌లో గేతేడాది జులైలో కేసు నమోదైంది.
ఇదే కేసులో విజయ్ పాల్ తో పాటు అప్పటి సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్, నిఘా విభాగం అధిపతి పీఎస్ఆర్ ఆంజనేయులు, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి తదితరులు విచారణ ఎదుర్కుంటున్నారు.