నూతన సంప్రదాయానికి తెరలేపిన ఏపీ ప్రభుత్వం

నూతన సంప్రదాయానికి తెరలేపిన ఏపీ ప్రభుత్వం నూతన సంప్రదాయానికి తెరలేపిన ఏపీ ప్రభుత్వం

Update: 2019-10-17 15:54 GMT

ఏపీ ప్రభుత్వం నూతన సంప్రదాయానికి తెరలేపింది. ఇక నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి రాష్ట్ర కేబినెట్‌ సమావేశం అయ్యేలా ప్రణాలిక తయారు చేసింది. ఈ విషయాన్నీ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి నెలా రెండు, నాలుగు బుధవారాల్లో కేబినెట్‌ సమావేశం కానుందని..

అయితే బుధవారం సెలవు దినమైతే గురువారం సమావేశం ఉంటుందని చీఫ్ సెక్రెటరీ పేర్కొన్నారు. అలాగే ఆరోజు ఉదయం 11 గంటల సమయానికల్లా మంత్రివర్గం సమావేశం కావాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ప్రతి శాఖ సంబంధిత ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలని అన్ని శాఖలకు సీఎస్‌ ఆదేశాలు జారీ చేశారు. ఒకటి, మూడు శనివారాల్లో శాఖల వారీగా ప్రతిపాదనలు తెలపాలని ఎల్వీ సుబ్రహ్మణ్యం సూచించారు. 

Tags:    

Similar News