జనవరి చివరివారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు
AP Assembly: ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోన్న ప్రభుత్వం
జనవరి చివరివారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు
AP Assembly: ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనుండటంతో.. జనవరి చివరివారం లేదా ఫిబ్రవరి మొదటివారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల ఏడాది కావడంతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్దమవుతుందని సమాచారం అందుతుంది. ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ సమావేశాలు కీలకంగా మారనున్నాయి.
అసెంబ్లీ సమావేశాలను ఐదు రోజుల పాటు నిర్వహించనున్నారని తెలుస్తోంది. నోటిఫికేషన్ విడుదలయ్యే ముందే బడ్జెట్‌ను ప్రవేశపెట్టి కొత్త పథకాలను ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో.. ఏపీ సర్కార్ కసరత్తులు ప్రారంభించింది. కొత్త పథకాలతో పాటు మరికొన్ని నూతన హామీలను కూడా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం వెల్లడించే అవకాశాలున్నాయి.