Anganwadi: ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీల నిరసనలు

Anganwadi: హామీలను వెంటనే అమలు చేయాలని అంగన్వాడీల డిమాండ్

Update: 2023-12-14 11:10 GMT

Anganwadi: ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీల నిరసనలు

Anganwadi: ఏపీ ప్రభుత్వం అంగన్వాడీల పట్ల చిన్నచూపుతో ఉందంటూ అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో అంగన్వాడీ వర్కర్లు భిక్షాటన చేపట్టి నిరసన తెలిపారు. ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించి భిక్షాటన చేపట్టారు. తెలంగాణలో ఆశావర్కర్ల కంటే వెయ్యి రూపాయలు ఎక్కువనే ఇస్తానన్న సీఎం జగన్.. ఇంతవరకు అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పును సైతం సీఎం జగన్ పట్టించుకోవడంలేదన్నారు. అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News