Bus Accident: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బస్ బోల్తా.. 12 మందికి తీవ్ర గాయాలు
Bus Accident: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గట్టుగూడెం సమీపంలో KVR ట్రావెల్స్ బస్ బోల్తా పడింది. బ్రేక్ ఫెయిల్ కారణంగా జరిగిన ప్రమాదంలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
Bus Accident: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బస్ బోల్తా.. 12 మందికి తీవ్ర గాయాలు
Bus Accident: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లా గట్టుగూడెం సమీపంలో రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కేవీఆర్ (KVR) ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ స్లీపర్ బస్సు బోల్తా పడింది. అశ్వారావుపేట దాటిన అనంతరం సుమారు 20 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత గట్టుగూడెం వద్ద బ్రేక్ ఫెయిల్ కావడంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లినట్లు సమాచారం.
ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 43 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్సులు, పోలీస్ వాహనాల ద్వారా సమీప ఆస్పత్రులకు తరలించారు.
ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మిగతా ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారని పోలీసులు తెలిపారు.