Pinnelli Brothers: టీడీపీ నేతల జంట హత్యల కేసులో పిన్నెల్లి బ్రదర్స్‌కు 3 రోజుల పోలీస్ కస్టడీ
Pinnelli Brothers : పల్నాడు జిల్లాలో టీడీపీ నేతల జంట హత్యల కేసులో జైల్లో ఉన్న పిన్నెల్లి సోదరులను మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వడానికి మాచర్ల కోర్టు అనుమతి ఇచ్చింది.
Pinnelli Brothers: టీడీపీ నేతల జంట హత్యల కేసులో పిన్నెల్లి బ్రదర్స్‌కు 3 రోజుల పోలీస్ కస్టడీ
Pinnelli Brothers: పల్నాడు జిల్లాలో టీడీపీ నేతల జంట హత్యల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి రామిరెడ్డిలను మూడు రోజుల పోలీస్ కస్టడీకి ఇవ్వడానికి మాచర్ల కోర్టు అనుమతి ఇచ్చింది.
కోర్టు ఉత్తర్వుల మేరకు నేటి నుంచి మూడు రోజుల పాటు పిన్నెల్లి సోదరులను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. జంట హత్యల కేసులో పలు కీలక అంశాలపై లోతైన విచారణ చేపట్టేందుకు పోలీస్ కస్టడీ అవసరమని పోలీసులు కోర్టును కోరినట్లు సమాచారం.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు అనుమానితులను విచారించిన పోలీసులు, పిన్నెల్లి బ్రదర్స్ నుంచి మరింత కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విచారణలో ఏ అంశాలు వెలుగులోకి వస్తాయన్నది ఆసక్తిగా మారింది.