Guntur: 77వ గణతంత్ర వేడుకలకు సిద్ధం కావాలి - గుంటూరు కలెక్టర్ తమీమ్ అన్సారియా
Guntur: గుంటూరు జిల్లాలో 77వ గణతంత్ర వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు.
Guntur: 77వ గణతంత్ర వేడుకలకు సిద్ధం కావాలి - గుంటూరు కలెక్టర్ తమీమ్ అన్సారియా
Guntur : గుంటూరు, గణతంత్ర వేడుకలకు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. 77వ గణతంత్ర వేడుకలపై సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి గణతంత్ర వేడుకలు తుళ్లూరు మండలం రాయిపూడిలో జరుగుతున్నాయని అన్నారు. ఈ వేడుకలు విజయవంతంగా నిర్వహించుటకు అందరు అధికారులు సమష్టిగా కృషి చేయాలని ఆదేశించారు. సిఆర్ డిఎ, శాఖల ప్రధాన కార్యాలయాలతో సమన్వయం చేసుకోవాలని అన్నారు. ఆయా శాఖలకు సూచించిన మేరకు శాఖల అభివృద్ధిని తెలియజేసే శకటాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. తాగు నీరు, పారిశుధ్యం పక్కా ఉండాలని తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజా వలి, రెవిన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస రావు, డిప్యూటీ కలెక్టర్ లు గంగ రాజు, లక్ష్మి కుమారి, శ్రీనివాస్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి బసు, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వి. విజయ లక్ష్మి, పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కె.వి.వి సత్యనారాయణ, జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.దుర్గా భాయి, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రవీంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు.