Vizianagaram: విజయనగరంలో డ్రైవర్‌కు ఫిట్స్.. ఆర్టీసీ బస్సు బోల్తా
విజయనగరం జిల్లా గరివిడిలో డ్రైవర్‌కు ఫిట్స్ రావడంతో ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
Vizianagaram: విజయనగరంలో డ్రైవర్‌కు ఫిట్స్.. ఆర్టీసీ బస్సు బోల్తా
Vizianagaram : విజయనగరం జిల్లా గరివిడి మండలం అప్పన్నవలస వద్ద సోమవారం ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. డ్రైవర్‌కు ఫిట్స్ రావడంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.
వివరాల ప్రకారం, రాజాం నుంచి విజయనగరం వైపు వస్తున్న పల్లెవెలుగు ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రయాణ సమయంలో అకస్మాత్తుగా డ్రైవర్‌కు అపస్మారక స్థితి రావడంతో బస్సుపై నియంత్రణ కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్, కండక్టర్‌తో కలిపి మొత్తం 87 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో ఏడుగురికి తీవ్ర గాయాలు కాగా, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ అప్పల గురువులు ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నారని సమాచారం.
సమాచారం అందుకున్న వెంటనే చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు, సీఐ శంకరరావు, గరివిడి ఎస్సై లోకేశ్వరరావు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన వారిని అంబులెన్స్‌ల ద్వారా చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.