SCR Special Trains: విశాఖ - చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు.. స్టాపింగ్స్, టైమింగ్స్ ఇవే!
సంక్రాంతి తిరుగు ప్రయాణ రద్దీని తగ్గించేందుకు విశాఖపట్నం - చర్లపల్లి మరియు వికారాబాద్ - తిరుపతి మధ్య దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. పూర్తి సమయాలు, స్టేషన్ల వివరాలు ఇక్కడ చూడండి.
సంక్రాంతి సెలవులు ముగియడంతో సొంతూళ్ల నుంచి నగరాలకు తిరుగు ప్రయాణమయ్యే వారి సంఖ్య భారీగా పెరిగింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం - చర్లపల్లి (హైదరాబాద్) మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ నెల 18, 19 తేదీల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.
రైళ్ల వివరాలు మరియు సమయాలు:
1. విశాఖపట్నం - చర్లపల్లి (రైలు నెం. 08517):
తేదీ: జనవరి 18 (ఆదివారం)
సమయం: మధ్యాహ్నం 3:50 గంటలకు విశాఖలో బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 7:30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.
2. చర్లపల్లి - విశాఖపట్నం (రైలు నెం. 08518):
తేదీ: జనవరి 19 (సోమవారం)
సమయం: ఉదయం 9:00 గంటలకు చర్లపల్లిలో బయల్దేరి.. మరుసటి రోజు అర్ధరాత్రి 12:30 గంటలకు విశాఖ చేరుకుంటుంది.
ఆగే స్టేషన్లు: దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, అన్నవరం, సామల్ కోట, రాజమండ్రి, నిడదోవలు, రాయనపాడు, ఖమ్మం, వరంగల్, కాజీపేట స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి. ఇందులో 2AC, 3AC, స్లీపర్, జనరల్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.
వికారాబాద్ - తిరుపతి స్పెషల్ ట్రైన్
తిరుమల వెళ్లే భక్తుల కోసం జనవరి 19న వికారాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు నడపనున్నారు.
సమయం: సాయంత్రం 4:15 గంటలకు వికారాబాద్‌లో బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 8:30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
ముఖ్య స్టాపింగ్స్: లింగంపల్లి, సికింద్రాబాద్, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట.