Antarvedi Lakshmi Narasimha Swamy: అంతర్వేదిలో లక్ష్మీనరసింహ స్వామి మహోత్సవాలు.. ఈ నెల 25 నుంచి ప్రారంభం

Antarvedi Lakshmi Narasimha Swamy: కోనసీమ జిల్లా అంతర్వేదిలో లక్ష్మీనరసింహ స్వామి మహోత్సవాలు ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరగనున్నాయి. సేవా కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది.

Update: 2026-01-20 07:03 GMT

Antarvedi: అంతర్వేదిలో లక్ష్మీనరసింహ స్వామి మహోత్సవాలు.. ఈ నెల 25 నుంచి ప్రారంభం

Antarvedi Lakshmi Narasimha Swamy: కోనసీమ జిల్లా అంతర్వేదిలో ప్రసిద్ధ లక్ష్మీనరసింహ స్వామి మహోత్సవాలు ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన సేవా కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పాల్గొని, స్వామివారి కళ్యాణ మహోత్సవానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కమిటీ సభ్యులకు సూచించారు. ఉత్సవాల నిర్వహణలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు.

ఈ సందర్భంగా ఉత్సవ సేవా కమిటీ చైర్మన్‌గా నియమితులైన దెందుకూరి రమేష్ ప్రమాణ స్వీకారం చేశారు. తనను చైర్మన్‌గా నియమించినందుకు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, పార్టీ ఇంచార్జి అమూల్య, అమలాపురం ఎంపీ హరీష్‌లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అన్ని ఏర్పాట్లు సమగ్రంగా పూర్తి చేసి, ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తామని కమిటీ చైర్మన్ దెందుకూరి రమేష్ తెలిపారు.

Tags:    

Similar News