Arasavalli Temple: అరసవల్లిలో ఏడు రోజుల రథసప్తమి వేడుకలు.. ఏర్పాట్లు వేగవంతం

Arasavalli Temple: శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలను ఏడు రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.

Update: 2026-01-20 07:12 GMT

 Arasavalli Temple: అరసవల్లిలో ఏడు రోజుల రథసప్తమి వేడుకలు.. ఏర్పాట్లు వేగవంతం

Arasavalli Temple: శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను వేగవంతం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఏడాది ఏడు రోజుల పాటు రథసప్తమి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

భక్తుల సౌకర్యార్థం భద్రత, పారిశుధ్యం, తాగునీరు, ట్రాఫిక్ నియంత్రణతో పాటు వైద్య సేవల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. అలాగే ఉత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ప్రసాద్ రావు తెలిపారు.

రథసప్తమి సందర్భంగా లక్షలాది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది. ఈ ఏర్పాట్లపై ఆలయ ఈవో ప్రసాద్ రావుతో మా ప్రతినిధి వరప్రసాద్ ఫేస్ టు ఫేస్‌లో మరిన్ని వివరాలు అందించనున్నారు.

Tags:    

Similar News