AP State Space Tech Summit 2026: గుంటూరులో ఏపీ స్టేట్ స్పేస్ టెక్ సమ్మిట్–2026 -విజ్ఞాన్ యూనివర్సిటీ

AP State Space Tech Summit 2026: గుంటూరు జిల్లా విజ్ఞాన్ యూనివర్సిటీలో ఈనెల 22 నుంచి 24 వరకు ఏపీ స్టేట్ స్పేస్ టెక్ సమ్మిట్–2026 నిర్వహణ. షార్, ఎన్ఆర్ఎసి డైరెక్టర్ల పాల్గొననున్నారు.

Update: 2026-01-20 10:11 GMT

AP State Space Tech Summit 2026: గుంటూరులో ఏపీ స్టేట్ స్పేస్ టెక్ సమ్మిట్–2026 -విజ్ఞాన్ యూనివర్సిటీ

AP State Space Tech Summit 2026:  గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్పేస్ టెక్ సమ్మిట్–2026 పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య, ఏపీ సైన్స్ సిటీ సీఈవో కేశినేని వెంకట్ పాల్గొన్నారు.

ఈ నెల 22, 23, 24 తేదీల్లో విజ్ఞాన్ యూనివర్సిటీ, అనంత్ స్పేస్ టెక్నాలజీస్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సమ్మిట్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శాటిలైట్ టెక్నాలజీ, రాకెట్ టెక్నాలజీ రంగాల్లో విద్యార్థులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు లావు రత్తయ్య తెలిపారు. రాబోయే రోజుల్లో అంతరిక్ష రంగంలో ఉద్యోగ అవకాశాలు భారీగా పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో షార్ డైరెక్టర్ ఈఎస్ పద్మకుమార్, ఎన్ఆర్ఎసి డైరెక్టర్ ప్రకాష్ చౌహాన్, డీఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి, రహదారులు & భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారని తెలిపారు.

ఏపీ సైన్స్ సిటీ సీఈవో కేశినేని వెంకట్ మాట్లాడుతూ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలపాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కూడా స్పేస్ టెక్నాలజీపై అవగాహన కల్పించడమే ఈ సమ్మిట్ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

Tags:    

Similar News