మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టనున్న సీఎం జగన్

మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టనున్న సీఎం జగన్ మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టనున్న సీఎం జగన్

Update: 2019-10-14 06:31 GMT

ఏపీలో మరో ప్రాతిష్టాత్మక పథకానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. బాలల దినోత్సవం అయిన నవంబర్ 14న నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకంలో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించనున్నారు. ప్రస్తుతం ఉన్న స్కూల్ భవనాలను ఫోటోలు తీసి ప్రజల ముందు ఉంచుతారు. ఆ తరువాత ఆ స్కూల్ లను ఆధునీకరించిన ఫోటోలను మళ్ళీ ప్రజల ముందు ఉంచుతారు. ఈ పథకానికి ఏడాదికి రూ.1500 కోట్ల చొప్పున నాలుగేళ్లలో రూ.6 వేల కోట్లు ఖర్చు చెయ్యాలని ప్రభుత్వం భావిస్తోంది.

కాగా ఈ పథకం ప్రైవేటు కాంట్రాక్టర్లతో కాకుండా కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ పద్ధతిలో చేయించాలని నిర్ణయించారు. కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ పద్ధతిని దేశంలోనే తొలిసారిగా అమలు చేస్తున్నారు. సొంత ఊరికి ఏదైనా చెయ్యాలి అనుకునే వారిని ఇందులో భాగస్వామ్యం చెయ్యాలనే ఆలోచనతో కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ పద్ధతిని ఎంచుకున్నారు సీఎం జగన్.

Tags:    

Similar News