నేడు ఏపీ మంత్రివర్గం సమావేశం.. చర్చించే అంశాలివే..

నేడు ఏపీ మంత్రివర్గం సమావేశం.. చర్చించే అంశాలివే.. నేడు ఏపీ మంత్రివర్గం సమావేశం.. చర్చించే అంశాలివే..

Update: 2019-10-16 01:36 GMT

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన నేడు (బుధవారం) రాష్ట్ర మంత్రివర్గం సమావేశం అవుతోంది. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఉదయం 11గంటలకు జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. క్యాబినెట్ లో చర్చించే అంశాలివే.. జనవరి 26 నుంచి మొదలయ్యే జగనన్న అమ్మ ఒడి పథకం. రూ.46,675 కోట్ల వ్యయంతో భారీ వాటర్‌ గ్రిడ్‌ పథకానికి ఆమోదం. చేనేత కార్మికుల కుటుంబాలకు ఏడాదికి రూ.24వేల చొప్పున డిసెంబర్‌ 21న ఆర్ధిక సాయం.

ఇసుక రవాణా కోసం 6000 వాహనాలను వివిధ వర్గాల యువతకు సమకూర్చడం. చిరు ధాన్యాలను పండించే రైతులను ప్రోత్సాహించడం. ఔట్‌ సోర్సింగ్‌లో దళారీ వ్యవస్థను నిర్మూలించడం. రోబో ఇసుక తయారీ. ఉద్దానం ప్రాంతంలో నిర్మిస్తున్న సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి ఉద్యోగుల నియామకం. గ్రామ న్యాయాలయాలు, ఉన్నత విద్య, స్కూలు విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ల సభ్యుల నియామకాలు వంటి కీలక అంశాలను మంత్రి వర్గంలో చర్చించి ఆమోదం తెలపనున్నారు.  

Tags:    

Similar News