ఏపీలో వచ్చే ఏడాది నుంచి విద్యా విధానంలో మార్పులు.. ఇవే!

ఏపీలో వచ్చే ఏడాది నుంచి విద్యా విధానంలో మార్పులు.. ఇవే! ఏపీలో వచ్చే ఏడాది నుంచి విద్యా విధానంలో మార్పులు.. ఇవే!

Update: 2019-10-14 04:21 GMT

జాతీయ విద్యా విధానం అమలులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి 1 నుంచి 5 తరగతుల సిలబస్‌ను నవీకరించే అవకాశం కనిపిస్తోంది. సిలబస్‌లో ప్రాక్టికల్ సెషన్‌లు, స్వీయ-అంచనా మరియు స్కిల్ డెవోలప్మెంట్ కు సంబంధించిన విషయాలు ఉండేలా ప్రణాళికతయారు చేశారు.

నూతన సిలబస్‌ కు సంబంధించి రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి (ఎస్‌సిఇఆర్‌టి) అధికారులు రాష్ట్ర హెచ్‌ఆర్‌డి మంత్రికి ప్రతిపాదన పంపారు. సిలబస్‌ను చివరిగా 2010 లో మార్చారు. 10 సంవత్సరాల తరువాత, సిలబస్‌ను నవీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి ఆదిములపు సురేష్.. అభివృద్ధి చెందుతున్న విధానాలకు తగిన విధంగా సిలబస్‌ను రూపొందించాలని పాఠశాల విద్యా శాఖ అధికారులను ఆదేశించారు.

ప్రస్తుతం, 1 నుండి 5 తరగతుల విద్యార్థులు గణితం మరియు పర్యావరణ శాస్త్రంతో పాటు ఇంగ్లీష్, తెలుగు, హిందీ వంటి సబ్జెక్టులు అలాగే వర్క్‌బుక్‌ ఉన్నాయి.. అయితే ఈ కొత్త ప్రతిపాదనల ప్రకారం, ప్రత్యేక వర్క్‌బుక్‌లకు బదులుగా, ప్రతి పాఠం చివరిలో విద్యార్థుల కోసం స్వీయ-అంచనా, స్కిల్ డెవోలప్మెంట్ ప్రొవిజన్స్ ను ప్రవేశపెడతారు.

దీనిపై పాఠశాల విద్యా శాఖ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ, "జాతీయ విద్యా విధానంలో మార్పు వచ్చిన ప్రతిసారీ, రాష్ట్రీయ విద్యార్థుల సిలబస్ కూడా మార్చబడుతుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త విద్యా విధానం అమల్లోకి వస్తుండటంతో, మార్పులు తొందరగా ఖరారు చేస్తాం. " అని అన్నారు. కాగా నూతన సిలబస్ ను జనవరి చివరి నాటికి ముద్రణకు పంపే అవకాశమున్నట్టు తెలుస్తోంది. 

Tags:    

Similar News