భోజనం పంపిణీ చేసిన టీడీపీ నాయకులు

Update: 2020-04-23 07:20 GMT

ఎస్.రాయవరం: మండలం కేంద్రంకి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు సోమిరెడ్డి రాజు ఆధ్వర్యంలో ఎంపీటీసీ-2 అభ్యర్థి దుబాసి జ్యోతి చేతుల మీదుగా 200 మందికి భోజనాలు అందించారు. కరోనా కట్టడికై విధులు నిర్వహిస్తున్న పోలీసులకు, ఆశా వర్కర్లకు, ప్రభుత్వ ఉద్యోగులకు, పాదచారులకు, పేదలకు భోజనం ప్యాకెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో దుబాసి రమేష్, కర్రి శ్రీను, గాలి దివాణం, టీచర్ కర్రి శ్రీను, భీమరశెట్టి శ్రీనువాసు తదితరులు పాల్గొన్నారు.


Tags:    

Similar News