అమరావతిపై ఏపీ స్పీకర్ తమ్మినేని సంచనల వ్యాఖ్యలు
-అమరావతి రాజస్థాన్ ఎడారిలా ఉంది -రాజధాని ప్రాంతం అందరూ గర్వపడేలా ఉండాలి -తమ్మినేని
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం రాజధాని విషయమై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఓ సారి అమరావతిలో పర్యటించిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. అమరావతి రాజస్థాన్ ఎడారిలా ఉందని అన్నారు. రాజధాని ప్రాంతం అందరూ గర్వపడేలా ఉండాలని అన్నారు. రాజధానిని చూడగానే...నా రాజధాని అనే ఫీలింగ్ ప్రజలకు కలగాలని తమ్మినేని అన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని తమ్మినేని గుర్తుచేశారు.