Mega DSC: మెగా డీఎస్సీ అభ్యర్ధులకు అలర్ట్.. నియామక పత్రాల పంపిణీ వాయిదా..!

Mega DSC 2025 Posting: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది.

Update: 2025-09-18 09:57 GMT

Mega DSC 2025 Posting: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాలను ఇప్పటికే విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. సెప్టెంబర్ 19న సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయాలని అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే, భారీ వర్షాల కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడింది.

అసెంబ్లీ వెనుక ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. కానీ బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆ ప్రాంతం మొత్తం నీటితో నిండిపోయింది. దీంతో అక్కడ కార్యక్రమం నిర్వహించడం సాధ్యం కాదని భావించి, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News