ఆరోగ్య పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శం: పుష్ప శ్రీవాణి

మండలంలోని చినమేరంగిలో ఉన్న డిప్యుటీ సిఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం ముఖ్యమంత్రి సహాయనిధికి చెందిన చెక్కులను పుష్ప శ్రీవాణి పంపిణీ చేశారు.

Update: 2020-02-17 11:42 GMT

జియ్యమ్మవలస: మండలంలోని చినమేరంగిలో ఉన్న డిప్యుటీ సిఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం ముఖ్యమంత్రి సహాయనిధికి చెందిన చెక్కులను నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన బాధితులకు ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి పంపిణీ చేశారు. ఈ సందర్భంగానే పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ... అన్ని రకాలైన ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయించడంతో పాటుగా చికిత్సానంతర విశ్రాంతి సమయంలో కూడా రోగులకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శప్రాయంగా మారిందని అభిప్రాయపడ్డారు.

ప్రజాహితం కోసం తన తండ్రి వైయస్సార్ ఒక్క అడుగు వేస్తే.. తాను రెండు అడుగులు వేస్తానని తన పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి.. వంద అడుగులు ముందుకేసి ఆరోగ్యశ్రీ పథకంలో చికిత్సల్ని విస్తృతం చేసి ఇతర రాష్ట్రాలలో కూడా చికిత్సలు చేయించుకొనే విధంగా ఆరోగ్యశ్రీ సేవలను విస్తరించారని ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్నికల సమన్వయకర్త బొంగు సురేష్, మాజీ ఎంపిపి ఇందిరా కుమారి, మండల కన్వీనర్ గౌరీశంకర్ రావు తదితరులు పాల్గొన్నారు.


Tags:    

Similar News