నేడు మరో పథకం ప్రారంభం.. ఒక్కో కుటుంబానికి కనీసం రూ.2లక్షలు..

అధికారంలోకి వచ్చిన తొలిరోజునుంచే జగన్ సర్కార్ ప్రజా సంక్షేమంపై ఎక్కువగా దృష్టిసారించింది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పేదలకు లబ్ది చేకూరేలా సంక్షేమ పథకాలను తీసుకువచ్చింది..

Update: 2020-10-21 02:10 GMT

అధికారంలోకి వచ్చిన తొలిరోజునుంచే జగన్ సర్కార్ ప్రజా సంక్షేమంపై ఎక్కువగా దృష్టిసారించింది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పేదలకు లబ్ది చేకూరేలా సంక్షేమ పథకాలను తీసుకువచ్చింది. తాజాగా మరో సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. రేషన్ కార్డు ఉండి.. ఆ కుటుంబలో ఎవరికైనా ప్రమాదం జరిగితే వారిని ఆర్ధికంగా ఆదుకునేందుకు వైఎస్సార్‌ బీమా పథకాన్ని అమలు చేయనుంది. ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు ప్రారంభించనున్నారు. ఈ పధకం ద్వారా రాష్ట్రంలో 1.41 కోట్ల బియ్యం కార్డు ఉన్న కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది.. ఇందుకోసం ఏడాదికి రూ.583.50 కోట్లు ఖర్చు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం.

18 నుంచి 70 ఏళ్లలోపు వయసు ఉండి కుటుంబాన్ని పోషించే వారికి ఈ పథకం వర్తిస్తుంది. 18 నుంచి 50 ఏళ్ల లోపు వయసుగలవారు సహజ మరణం పొందితే రూ.2 లక్షలు.. ప్రమాదవశాత్తూ మరణించినా, ప్రమాదంలో పూర్తి అంగవైకల్యం భారిన పడినా.. రూ.5 లక్షల బీమా పరిహారం వారి నామినీకి అందజేస్తారు. అలాగే 51 నుంచి 70 ఏళ్లలోపు వయసున్న లబ్ధిదారులు ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత అంగవైకల్యం పొందినా నామినీకి రూ.3లక్షల పరిహారం ఇస్తారు. 18-70 ఏళ్లలోపు వయసున్న లబ్ధిదారులు ప్రమాదవశాత్తూ పాక్షిక, శాశ్వత అంగవైకల్యం పొందితే రూ.1.50 లక్షలు ఇస్తారు. నామినీలుగా భార్య, 21 ఏళ్లు నిండిన కొడుకు, పెళ్లి కాని కూతురు, వితంతువు అయిన కూతురు. ఒకవేళ లబ్ధిదారుడుతో ఉంటే.. వారి మీద ఆధార పడిన తల్లిదండ్రులు.. వితంతువు అయిన కోడలు లేదా ఆమె పిల్లలకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ పథకం లబ్ధిదారులకు ఐడెంటిటీ కార్డు కూడా ఇస్తారు. ఈ పథకం ఎంపిక వాలంటీర్ల డోర్ టూ డోర్ సర్వే ద్వారా ఉంటుంది. 

Tags:    

Similar News