Somu Veerraju: బాబు గారూ... చాల్ చాల్లే నీ త్యాగాలు..
Somu Veerraju: ఏపీలో జగన్ సర్కారును కూలదోసేందుకు త్యాగాలకు సిద్ధమంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు.
Somu Veerraju: బాబు గారూ... చాల్ చాల్లే నీ త్యాగాలు..
Somu Veerraju: ఏపీలో జగన్ సర్కారును కూలదోసేందుకు త్యాగాలకు సిద్ధమంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు. చంద్రబాబు చేసే త్యాగాలను బీజేపీ రిసీవ్ చేసుకోదన్నారు. బీజేపీ ఇప్పటికే ఎన్నో త్యాగాలు చేసిందన్నారు సోము వీర్రాజు. కుటుంబ, అవినీతి పార్టీల కోసం బీజేపీ త్యాగాలు చేయదన్నారు.
ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని తేల్చి చెప్పారు. 2024లో బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని సోము జోస్యం చెప్పారు. జూన్ మొదటి వారంలో విజయవాడ, రాజమండ్రిలో భారీ సభలు నిర్వహించి ఎన్నికల శంఖరావం పూరిస్తామన్నారు.