Andhra Pradesh Bandh Live Updates: ఏపీ బంద్

Andhra Pradesh Bandh Live Updates: ఆంధ్రప్రదేశ్ లో విశాక స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణకు వ్యతిరేకంగా రాష్ట్రం మొత్తం బంద్ చేపట్టారు

Update: 2021-03-05 04:17 GMT

ఫైల్ ఇమేజ్ 

Steel Plant: ఆంధ్రప్రదేశ్ లో విశాక స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణకు వ్యతిరేకంగా రాష్ట్రం మొత్తం బంద్ చేపట్టారు. ఇందులో లో భాగంగా రాష్ట్రంలోని పలు జిల్లాలో బంద్ ఇలా..

Live Updates
2021-03-05 07:27 GMT

కృష్ణా జిల్లా:

కృష్ణా జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కైకలూరులో వైసీపీ, టీడీపీల మధ్య ఫ్లెక్సీ వివాదం చోటుచేసుకుంది. రాష్ట్ర బంద్‌ పిలుపుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ కార్యకర్తలు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జయమంగల వెంకటరమణ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 

2021-03-05 07:24 GMT

 అనంతపురం జిల్లా:

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఏపీ బంద్ అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక, ఉద్యోగ సంఘాలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగాయి. అనంతపురం నగరంలో ఆందోళనకారులు ర్యాలీ చేపట్టారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ జరిగినా బయటి వ్యక్తులు ఎవరిని విశాఖ లో అడుగుపెట్టనివ్వమని ఆందోళనకారులు హెచ్చరిస్తున్నారు.

2021-03-05 06:46 GMT

విశాఖ జిల్లా:

మద్దిలపాలెం

మద్దిలపాలెం కూడలిలో బంద్‌లో పాల్గొన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌. రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఎంతోమంది ప్రాణ త్యాగాలతో స్టీల్‌ ప్లాంట్‌ సాధించుకున్నామని, కేంద్రం ఇప్పటికైనా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

2021-03-05 06:42 GMT

తిరుపతి:

తిరుపతిలో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. విశాఖ స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బంద్‌ పాటిస్తున్నారు. వామపక్ష పార్టీలతో పాటు.. విపక్షాలు కూడా బంద్‌కు మద్ధతు పలికాయి. 

2021-03-05 06:37 GMT

కర్నూలు జిల్లా:

విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి పిలుపుతో కర్నూలు జిల్లాలో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. బంద్‌కు మద్దతు ప్రకటిస్తూ ప్రభుత్వం.. ఆర్టీసీ బస్సులను నిలిపివేసింది. అత్యవసర ప్రయాణాలు పెట్టుకున్నవారు తప్ప.. మిగిలిన వారందరికీ ముందస్తు సమాచారం ఉండడంతో చాలా మంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. 

2021-03-05 06:30 GMT

విజయవంతంగా కొనసాగుతున్న బంద్:

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏపీ వ్యాప్తంగా బంద్‌ కొనసాగుతోంది. రాష్ట్ర బంద్‌కు వామపక్షాలు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఆంధ్రుల ఆస్తులతో కేంద్రం వ్యాపారం చేస్తోందని, బీజేపీతో రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం లేదని మండిపడుతున్నారు వామపక్షాల నేతలు. రాష్ట్రంలో ఉన్న విలువైన ఆస్తులను మోడీ ప్రభుత్వం దోచుకుంటోందని ఆరోపిస్తున్నారు వామపక్షాల నేతలు.

2021-03-05 06:14 GMT

కర్నూలు జిల్లా:

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల బంద్ పిలుపునకు కర్నూలు జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల నుండి మద్దతు లభించింది. దీంతో ఉదయం నుండే ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయితే వాణిజ్య సముదాయాలతో పాటు ప్రైవేటు స్కూలు, ప్రభుత్వ స్కూల్స్ అన్ని కూడా మూతపడ్డాయి.

2021-03-05 06:10 GMT

కడప జిల్లా:

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కడప జిల్లాలో బంద్ కొనసాగుతొంది. ఈ బంద్ కు రాష్ట్ర ప్రభుత్వం కూడ సంఘీభావం తెలపడంతో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు, వ్యాపార సమూదాయాలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు సైతం బస్టాండ్ కు పరిమితమయ్యాయి. స్టీల్ ప్లాంటును ప్రయివేటీకరిస్తే రాష్ట ప్రభుత్వమే హ్యండ్ ఓవర్ చేసుకుంటుందని సీఎం జగన్ చెప్పడం హర్షనీయమని కడప జిల్లా వాసులు అంటున్నారు. 

2021-03-05 05:39 GMT

తిరుపతి:

తిరుపతిలో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. విశాఖ స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బంద్‌ పాటిస్తున్నారు. వామపక్ష పార్టీలతో పాటు.. విపక్షాలు కూడా బంద్‌కు మద్ధతు పలికాయి.

2021-03-05 04:33 GMT

కాకినాడ: 

ఏపీ వ్యాప్తంగా బంద్‌ కొనసాగుతోంది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కాకినాడ పోర్టు ఎదురుగా వామపక్షాలు, కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేట్‌పరం చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మోడీ. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు వామపక్ష నాయకులు. 

Tags:    

Similar News