సోమశిలకు మరోసారి భారీ వరద

Update: 2019-10-20 03:19 GMT

నెల్లూరు జిల్లాలో ఉన్న సోమశిల జలాశయానికి భారీగా వరదనీరు చేరుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. శనివారం 8070 క్యూసెక్కు లు సోమశిల జలాశయానికి వచ్చాయి. ప్రస్తుతం నీటి నిల్వ 73.219 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఫ్లో కొనసాగుతుండటంతో దిగువకు 11,300 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గడిచిన రోజులనుంచి జలాశయంలో నుంచి 73-74 టీఎంసీల మధ్య నీరు నిల్వ ఉందని స్పష్టం చేశారు.

Tags:    

Similar News