రాజకీయ లబ్ది కోసమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో లాంగ్ మార్చ్ చేశారని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. పవన్ కళ్యాణ్, టిడిపి దత్త పుత్రుడని విషయాన్ని ఎన్నికల సమయంలో అందరం చూశామన్నారు. టిడిపి నేతలు ఇసుకను దోచుకున్న సమయంలో పవన్ ఎక్కడున్నాడని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ సక్షేమ పధకాలతో ప్రజలు ఆనందంగా ఉన్నారని సర్వేలు చెప్తున్నా పవన్ ప్రభుత్వం పై బురదజల్లుతున్నారన్నారు.