ఆకివీడు: నగర పంచాయితి పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు ఆదర్శ లయన్స్ క్లబ్ సభ్యులు దుస్తులు, సబ్బులు పంచాయతీ కార్యాలయంలో కమిషనర్ ప్రభుదాస్ చేతుల మీదుగా మంగళవారం అందజేశారు. ఆపత్కాల సమయంలో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి సేవచేస్తున్న పారిశుధ్య కార్మికులకు ఏంత చేసినా తక్కువేనని, వారి శ్రమకు వెలకట్టలేమని, వారి సేవలు నిరుపమానమైనవని అన్నారు.
పారిశుద్ధ్య మహిళలకు చీర, జాకెట్, డెటాల్ సబ్బు, పురుషులకు ప్యాంట్, షర్ట్, డెటాల్ సబ్బు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పల్లి రంగారెడ్డి, సెక్రటరీ భమిడిపాటి సూర్య భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.