Tirumala: తిరుమల శ్రీవారి సేవలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేశ్
Tirumala: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ దర్శించుకున్నారు.
Tirumala: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా.. ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. జనవరి 14న తాను హీరోయిన్‌గా నటించిన అనగనగా ఒక రాజు విడుదలవుతోందని తెలిపింది. సంక్రాంతికీ విడుదల అవుతున్న అన్ని చిత్రాలు విజయం సాధించాలని.. తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తున్నట్లు ఐశ్వర్య రాజేష్ తెలిపారు.