కార్మికుల పక్షాన పోరాడుతున్నందుకే జనసేన ఆందోళనకు మద్దతు ఇచ్చామ్నారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు. విశాఖ జనసేన నిర్వహించిన లాంగ్ మార్చ్ సభలో పాల్గొన్న అచ్చెన్నాయుడు వైసీపీ సర్కార్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇంత శాడిస్టు ప్రభుత్వాన్ని మాత్రం ఎప్పుడూ చూడలేదని అన్నారు. రాష్ర్ట మంత్రులు కల్లుతాగిన కోతుల్లా ప్రవర్తిస్తున్నారన్నారు. రోజుకో మాట.. పూటకో మాట మాట్లాడుతూ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.