Nellore: అంబులెన్స్‌ అంటే పడదు.. నెల్లూరులో సైకో హల్‌చల్‌..

Nellore: రోడ్డుపై అంబులెన్స్‌ వస్తే ఎవరైనా దారిస్తారు.

Update: 2023-04-14 07:04 GMT

Nellore: అంబులెన్స్‌ అంటే పడదు.. నెల్లూరులో సైకో హల్‌చల్‌..

Nellore: రోడ్డుపై అంబులెన్స్‌ వస్తే ఎవరైనా దారిస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం తన బండి అడ్డం పెట్టి మరీ ఆపాడు. అంబులెన్స్‌ అంటే తనకు పడదంటూ డ్రైవర్‌తో గొడవ పెట్టుకున్నాడు. నెల్లూరులో జరిగిన ఈ ఘటనతో పది నిమిషాల పాటు అంబులెన్స్ రోడ్డుమీదే నిలిచిపోయింది. రోజూ 50 అంబులెన్స్‌లు తిప్పుతూ తనను మానసిక క్షోభకు గురిచేస్తున్నారంటూ వింతగా ప్రవర్తించాడు ఆ వ్యక్తి. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అతన్ని అడ్డు తప్పించేందుకు ప్రయత్నించారు. దాంతో వారిపైనా తిరగబడ్డాడు ఆ సైకో. అడ్డొచ్చిన వారినల్లా తీవ్ర పదజాలంతో దూషించాడు. స్థానికులు ఎంత వారించినా పట్టించుకోకుండా వాహనానికి అడ్డు తప్పుకోలేదు.

ఇక పోలీసులు రంగప్రవేశం చేసినా అలాగే ప్రవర్తించాడు ఆ సైకో. తాళం తీసుకోబోతున్న కానిస్టేబుల్‌ను అడ్డుకుని తన బండి మీద తిష్ట వేశాడు. స్టేషన్‌కు రమ్మంటే బండి మీద కూర్చో నేను తీసుకెళ్తా అంటూ కాసేపు కానిస్టేబుల్‌తో వారించాడు. చివరకు పోలీసులు, స్థానికులు కలిసి అతన్ని బలవంతంగా పక్కకు నెట్టడంతో అక్కడ నుంచి అంబులెన్స్ కదిలింది. అంబులెన్స్‌ను అడ్డుకున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు.. నీటిపారుదల శాఖలో ఉద్యోగిగా గుర్తించారు పోలీసులు. గత కొంతకాలంగా అతను అనారోగ్యంతో బాధపడుతున్నట్లు చెపుతున్నారు. 

Tags:    

Similar News