Kuppam Bomb Blast: కుప్పంలో అర్ధరాత్రి ఓ ఇంట్లో పేలుడు.. దంపతులకు తీవ్ర గాయాలు

Kuppam Bomb Blast: పేలుడు ధాటికి ధ్వంసమైన ఇంటి తలుపులు, సామగ్రి

Update: 2023-06-26 05:03 GMT

Kuppam Bomb Blast: కుప్పంలో అర్ధరాత్రి ఓ ఇంట్లో పేలుడు.. దంపతులకు తీవ్ర గాయాలు

Kuppam Bomb Blast: చిత్తూరు జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కుప్పంలో భారీ పేలుడు కలకలం రేపింది. ఓ ఇంట్లో నాటుబాంబు పేలడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిలో ఆ ఇంట్లోని మురుగేష్, ధనలక్ష్మి దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించారు. అయితే, వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. పేలుడు సమాచారం తెలియడంతో ఘటనా స్థలికి చేరుకన్న పోలీసులు పేలుళ్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పేలుడుకు కారణం నాటుబాంబులా, జిలెటిన్ స్టిక్సా అనేది తేలాల్సి ఉందన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిముందు నాటుబాంబులు పేల్చినట్లు సమాచారం. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమయ్యింది. వీరిని టార్గెట్ చేసే పేలుళ్లకు పాల్పడ్డారా? లేక ఇంకేదైనా కారణముందా? దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Tags:    

Similar News