కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తో కేటీఆర్ భేటీ

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో భేటీ అయిన మంత్రి కేటీఆర్ రంగారెడ్డి జిల్లాలో ఫార్మా సిటీ ఏర్పాటుకు సహకారం అందించాలని కోరారు. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానిఫ్యాక్చరింగ్ జోన్ కింద ఫార్మా సిటీ ఏర్పాటులో మౌలిక సదుపాయాల కల్పనకు DPIIT కింద నిధులు సమకూర్చలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.

Update: 2019-10-31 14:17 GMT

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో భేటీ అయిన మంత్రి కేటీఆర్ రంగారెడ్డి జిల్లాలో ఫార్మా సిటీ ఏర్పాటుకు సహకారం అందించాలని కోరారు. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానిఫ్యాక్చరింగ్ జోన్ కింద ఫార్మా సిటీ ఏర్పాటులో మౌలిక సదుపాయాల కల్పనకు  DPIIT కింద నిధులు సమకూర్చలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లాలో గ్రానైట్ రవాణా కోసం రైల్వే సైడింగ్ సదుపాయం కల్పించాలని కేటీఆర్కోరారు. రైల్వే సైడింగ్ సదుపాయంతో గ్రానైట్ రవాణా, సిమెంట్, ఇనుము, పండ్ల రవాణా సులభతమవుతుందని పీయూష్ గోయల్ కు తెలిపారు. విజయవాడ నుంచి హైదరాబాద్ కు నల్గొండ మీదుగా రోజువారీ ప్యాసింజర్ రైలు నడపాలని విజ్ఞప్తి చేశారు.

పీయూష్ గోయల్ తో భేటీ అనంతరం, హోంశాఖ మంత్రి అమిత్ షాను కేటీఆర్ కలిశారు. GHMC పరిధిలోని SRDP పనుల్లో భాగంగా రసూల్ పురా దగ్గర ప్రతిపాదించిన ప్లైఓవర్ కోసం ఇంటర్ స్టేట్ పోలీస్ వైరలెస్ స్టాఫ్ క్వార్టర్స్ కు చెందిన ఎకరం 62 సెంట్లు భూమిని అప్పగించాలని కోరారు. దీనికి కోసం GHMC ఆధ్వర్యంలో మరోచోట స్టాఫ్ క్వార్టర్స్ నిర్మిస్తామని కేటీఆర్, అమిత్ షాకు తెలిపారు.





Tags:    

Similar News