ప్రజాభీష్టం మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది- యార్లగడ్డ

-జీవో 81పై స్పందించిన అధికార భాషా సంఘం అధ్యక్షుడు -ఆంగ్ల మాధ్యమం కావాలని జగన్‌ పాదయాత్రలో ప్రజలే కోరారు- యార్లగడ్డ -తల్లిదండ్రుల్లో మార్పు వచ్చినప్పుడే తెలుగుకి ప్రాముఖ్యత పెరుగుతుంది- యార్లగడ్డ

Update: 2019-11-07 15:34 GMT
Yarlagadda Lakshmi Prasad

ఏపీలో జీవో 81 విడుదలపై అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ స్పందించారు. అల్పాదాయ, మధ్య ఆదాయ వర్గాల వారి పిల్లలకు తెలుగు మాధ్యమంలో కాకుండా, ఆంగ్ల మాధ్యమంలో చదువు కావాలని జగన్‌.. పాదయాత్రలో కోరారని.. ప్రజాభీష్టానికి అనుగుణంగానే ప్రభత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఏపీలో అన్ని పాఠశాలల్లో ఒటకో తరగతి నుంచి పదో తరగతి తెలుగు సబ్జెక్టును తప్పని సరి చేస్తూ.. జీవోలో ఉందని, ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. తల్లిదండ్రుల్లో మార్పు వచ్చినప్పుడే తెలుగుకి ప్రాముఖ్యత, ప్రాధాన్యత పెరుగుతుందని, ఏపీలో శిలాఫలకాలన్నీ తెలుగులో ఉండాలన్నారు అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌.

Tags:    

Similar News