ఆర్టీసీ సమ్మెపై హై కోర్టులో ముగిసిన వాదనలు..విచారణ వాయిదా

- ఆర్టీసీ సమ్మెపై హై కోర్టులో విచారణ - కేసును 10వ తేదీకి వాయిదా వేసిన కోర్టు -సర్కార్, ఆర్టీసీ యూనియన్లను కౌంటర్ దాఖలుకు ఆదేశం -ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేశామన్నఅడ్వకేట్ జనరల్

Update: 2019-10-06 14:35 GMT

ఆర్టీసీ సమ్మెను తక్షణం విరమింప చేయాలంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారించిన కోర్టు ఈనెల 10వ తేదీకి కేసును వాయిదా వేసింది. సమ్మెపై ప్రభుత్వం, ఆర్టీసీ యూనియన్లు వేర్వేరుగా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఆర్టీసీలోని రెండు యూనియన్లకు నోటీసులివ్వాలంటూ ఏజీ సర్కార్ని ఆదేశించారు. మరోవైపు సమ్మెను విరమింప చేయాలంటూ కృష్ణయ్యఅనే లాయర్ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. సమ్మె వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తక్షణం సమ్మెను విరమింప చేయాలంటూ పిటిషనర్ కోరారు.సమ్మెవల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగడం లేదని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. 

Tags:    

Similar News