Health Tips: ఖాళీ కడుపుతో ఈ పండ్లను అస్సలు తినకండి.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు!
ఖాళీ కడుపుతో కొన్ని పండ్లు తింటే గ్యాస్ట్రిక్ సమస్యలు, ఆమ్లత్వం పెరిగే ప్రమాదం.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న కీలక సూచనలు!
Health Tips: ఖాళీ కడుపుతో ఈ పండ్లను అస్సలు తినకండి.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు!
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి, కానీ వాటిని ఏ సమయంలో తింటున్నాం అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో కొన్ని పండ్లు తింటే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ పండ్లు ఏంటి, వాటిని ఉదయం సమయంలో తినడం కారణంగా వచ్చే సమస్యలు ఏంటనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఈ సందర్భంగా పలువురు ఆరోగ్య నిపుణులు మాట్లాడుతూ.. ఉదయం సమయంలో పొరపాటున కూడా ఈ పండ్లను అసలు తినకూడదని చెబుతున్నారు. అవి ఏంటంటే..నారింజ, బత్తాయి వంటి పండ్లు. ఎందుకని వీటిని ఉదయం సమయంలో తినకూడదంటే.. వీటిలో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుందన్నారు. వీటిని ఉదయాన్నే తింటే కడుపులో మంట, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తే సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే అరటిపండ్లను కూడా ఉదయం టైంలో తినకూడదని చెప్పారు. ఎందుకంటే ఇందులో మెగ్నీషియం, షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందన్నారు. వీటిని ఖాళీ కడుపుతో తింటే రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగడమే కాకుండా, శరీరంలో పోషకాల సమతుల్యత దెబ్బతింటుందన్నారు. వీటితో పాటు మామిడి పండ్లను కూడా ఖాళీ కడుపుతో తీసుకోకూడదని చెప్పారు. ఎందుకంటే వీటిలో చక్కెర శాతం చాలా ఎక్కువగా ఉంటుందని, వీటిని ఖాళీ కడుపుతో తింటే షుగర్ లెవల్స్ వేగంగా పెరుగుతాయని చెప్పారు. ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్నవారు ఈ పండ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
పండ్లు తినేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే..
* పుల్లని పండ్లను ఖాళీ కడుపుతో కాకుండా, ఏదైనా తిన్న తర్వాత తీసుకోవడం మంచిది.
* పండ్లను పాలతో కలిపి తీసుకోకపోవడమే ఉత్తమం (ఫ్రూట్ షేక్స్ వంటివి జీర్ణక్రియపై ప్రభావం చూపవచ్చు).
* పండ్లను కోసిన వెంటనే తినేయాలి. ఎక్కువ సేపు నిల్వ ఉంచిన ముక్కలను తినకూడదు.
* పండ్లను జ్యూస్ రూపంలో కంటే, ముక్కలుగా కోసుకుని బాగా నమిలి తింటేనే పూర్తి పోషకాలు అందుతాయి.
* పండ్లు తినడానికి ఉత్తమ సమయం అంటే.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత లేదా మధ్యాహ్నం భోజనానికి ముందు. ఇలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయని నిపుణులు పేర్కొన్నారు.