Health Tips: సిగరెట్ తాగితే ఒత్తిడి తగ్గుతుందా? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు!
Health Tips: సిగరెట్ తాగితే ఒత్తిడి తగ్గుతుందా? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు!
Health Tips: సిగరెట్ తాగితే ఒత్తిడి తగ్గుతుందా? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు!
ఆఫీసులో పని ఒత్తిడి పెరిగినా, ఏదైనా టెన్షన్ వచ్చినా చాలామంది వెంటనే చేసే పని ఒక సిగరెట్ వెలిగించడం. అలా దమ్ము పీలిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని, ఒత్తిడి తగ్గుతుందని చాలా మంది నమ్ముతుంటారు. కానీ, ఇది నిజంగా ఒత్తిడిని తగ్గిస్తుందా? లేక మనల్ని మనం మోసం చేసుకుంటున్నామా? దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సిగరెట్‌లో ఉండే నికోటిన్ అనే పదార్థం మెదడుకు చేరగానే 'డోపమైన్' అనే హార్మోన్‌ను రిలీస్ అవుతుంది. ఇది మనకు కాసేపు ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. అందుకే సిగరెట్ తాగగానే ఒత్తిడి తగ్గినట్లు అనిపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ డోపమైన్ ప్రభావం కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుందన్నారు. ఆ తర్వాత మళ్లీ సిగరెట్(నికోటిన్) కోసం మనసు, మెదడు తపించడం స్టార్ అవుతుందన్నారు. దీనివల్ల చిరాకు, ఆందోళన పెరుగుతాయన్నారు. నిజానికి స్మోకింగ్ అనేది ఒత్తిడిని తగ్గించదని, పోనుపోను ఒత్తిడిని రెట్టింపు చేస్తుందన్నారు.
సిగరెట్ తాగడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
* శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నిరంతర దగ్గు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ముప్పు పెరుగుతుంది.
* ధూమపానం వల్ల డిప్రెషన్, స్కిజోఫ్రెనియా వంటి తీవ్రమైన మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉందని అన్నారు.
* సిగరెట్ తాగే వారిలో వ్యాయామం చేసే శక్తి లేదా కష్టపడే సామర్థ్యం వేగంగా తగ్గుతుందన్నారు.
ఈ వ్యసనం నుంచి బయటపడటానికి ఇలా చేయండి..
స్మోకింగ్ మానేయడానికి ఇప్పుడు అనేక మంచి మందులు, కౌన్సెలింగ్ అందుబాటులో ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒకసారి ఈ అలవాటు మానేస్తే, ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా.. సహజంగానే ఒత్తిడిని తట్టుకునే శక్తి మనలో పెరుగుతుందన్నారు. ఒత్తిడి తగ్గించుకోవడానికి సిగరెట్ తాగకుండా.. యోగా, ధ్యానం లేదా చిన్నపాటి నడకకు ప్రాముఖ్యత ఇచ్చి, వీటిని మీ రోజు వారి జీవితంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ అలవాట్లు మీ ఊపిరితిత్తులకు, మనసుకు ఎంతో మేలు చేస్తాయని చెప్పారు.