Natural Glow: మెరిసే ముఖం కోసం మీ ఇంట్లోనే ఇలా ట్రై చేయండి!

Natural Glow: ఈ రోజుల్లో చాలా మంది వారి అందం కోసం వాడని క్రీములు లేవంటే అతిశయోక్తి కాదు. ఎంతో మంది అందమైన ముఖం కోసం రకరకాల ఫేస్‌వాష్‌లు, క్రీములు, సీరమ్‌లు వాడటం పరిపాటిగా మారింది.

Update: 2026-02-22 11:36 GMT

Natural Glow: మెరిసే ముఖం కోసం మీ ఇంట్లోనే ఇలా ట్రై చేయండి!

Natural Glow: ఈ రోజుల్లో చాలా మంది వారి అందం కోసం వాడని క్రీములు లేవంటే అతిశయోక్తి కాదు. ఎంతో మంది అందమైన ముఖం కోసం రకరకాల ఫేస్‌వాష్‌లు, క్రీములు, సీరమ్‌లు వాడటం పరిపాటిగా మారింది. అయితే, కెమికల్స్‌తో కూడిన ఈ క్రీములు తాత్కాలికంగా మెరుపునిచ్చినా, దీర్ఘకాలంలో చర్మానికి హాని చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటికి బదులుగా మన ఇంటి పెరట్లోనే లభించే వేపతో అద్భుతమైన ఫలితాలను పొందవచ్చని సూచిస్తున్నారు. ఇంతకీ అవి ఏంటో ఈస్టోరీలో తెలుసుకుందాం.

మన చర్మం సహజత్వాన్ని కోల్పోవడానికి ప్రధాన కారణాలు..

* గాలిలోని కాలుష్యం, దుమ్ము, ధూళి.

* చర్మ రంధ్రాలు మూసుకుపోవడం.

* చర్మంపై అధికంగా జిడ్డు (ఆయిల్) చేరడం.

* రాత్రిపూట మేకప్ తొలగించకపోవడం.

వేపను ఇలా ట్రై చేయండి..

వేప ఆకులతో చర్మాన్ని శుభ్రపరిచే రెండు సులభమైన పద్ధతులను పలువురు వైద్య నిపుణులు వివరించారు. ముందుగా ఒక గిన్నెలో నీటిని తీసుకుని అందులో కొన్ని వేప ఆకులను వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత ఒక టవల్‌ను తలపై కప్పుకుని, ఆ వేప నీటి ఆవిరిని ముఖానికి పట్టించాలి. దీంతో వచ్చే ప్రయోజనం ఏంటంటే.. వేపలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు మొటిమలను తగ్గిస్తాయి. చర్మ రంధ్రాలను లోతుగా శుభ్రం చేసి, చికాకును తగ్గిస్తాయన్నారు. అంతేకాకుండా, ఈ ఆవిరి పీల్చడం వల్ల ముక్కు దిబ్బడ తగ్గి, శ్వాస తీసుకోవడం సులభతరమవుతుందన్నారు.

ఇంకో పద్ధతి ఏంటంటే.. వేప ఆకులను మరిగించిన నీటిని చల్లార్చి ఒక స్ప్రే బాటిల్‌లో నింపుకోవాలి. దీనిని సహజమైన 'టోనర్'లా ముఖంపై చల్లుకోవచ్చు. దీంతో ప్రయోజనం ఏంటంటే.. ఇది జిడ్డు చర్మాన్ని కంట్రోల్ చేయడంలో అద్భుతంగా పనిచేస్తుందన్నారు. అలాగే ఇది ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటుందని చెప్పారు. దీనిని క్రమం తప్పకుండా వాడితే మొటిమలు, నల్లటి మచ్చలు మాయమవుతాయని చెప్పారు. నిజానికి వేపలో సహజంగానే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయన్నారు. ఇవి చర్మంపై మంటను తగ్గించి, అదనపు నూనెను నియంత్రించడమే కాకుండా ముఖం రంగును మెరుగుపరుస్తాయని చెప్పారు.

Tags:    

Similar News