March 2026 Bank Holidays: మార్చి బ్యాంక్ సెలవులు 2026.. 11 రోజులు బ్రాంచ్‌లు మూసివేత

March 2026 Bank Holidays: మార్చి 2026లో హోలీ, ఉగాది, రంజాన్, శ్రీరామనవమి పండుగలతో పాటు వారాంతాలు కలిపి మొత్తం 11 రోజులు బ్యాంకులు మూసివుండనున్నాయి. డిజిటల్ సేవలు అందుబాటులో ఉంటాయి.

Update: 2026-02-24 10:49 GMT

March 2026 Bank Holidays: మార్చి బ్యాంక్ సెలవులు 2026.. 11 రోజులు బ్రాంచ్‌లు మూసివేత

మార్చి 2026లో బ్యాంక్ సేవలను వినియోగించే కస్టమర్లు ముందస్తుగా ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నెలలో హోలీ, ఉగాది, రంజాన్, శ్రీరామనవమి వంటి ప్రధాన పండుగలు రావడంతో పాటు సాధారణ వారాంత సెలవులు కలిపి మొత్తం 11 రోజులు బ్యాంకులు మూసివుండనున్నాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన సెలవుల క్యాలెండర్ ప్రకారం రాష్ట్రాలవారీగా బ్యాంక్ హాలిడేలు మారుతూ ఉంటాయి. హైదరాబాద్ ప్రాంతంలో మార్చి 3న హోలీ, మార్చి 19న ఉగాది, మార్చి 21న రంజాన్, మార్చి 27న శ్రీరామనవమి సందర్భంగా బ్యాంకులు మూసివుంటాయి. విజయవాడ ప్రాంతంలో మార్చి 3న హోలీ, మార్చి 19న ఉగాది, మార్చి 20న రంజాన్, మార్చి 27న శ్రీరామనవమి సెలవులు ఉన్నాయి.

ఇవే కాకుండా మార్చి 1, 8, 15, 22, 29 తేదీలలో ఆదివారాలు రావడంతో ఆ రోజులు బ్యాంకులు పనిచేయవు. మార్చి 14న రెండో శనివారం, మార్చి 28న నాలుగో శనివారం కూడా బ్యాంకులకు సెలవు ఉంటుంది. మొత్తం కలిపి ఈ నెలలో 11 రోజులపాటు బ్రాంచ్ సేవలు నిలిచిపోనున్నాయి. ఉగాది, రంజాన్ పండుగలు వారాంతానికి సమీపంలో రావడంతో రెండు లాంగ్ వీకెండ్స్ ఏర్పడే అవకాశం ఉంది.

అయితే బ్రాంచ్‌లు మూసివున్నప్పటికీ డిజిటల్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సేవల ద్వారా డబ్బుల బదిలీలు, బిల్లుల చెల్లింపులు, ఖాతా వివరాలు తెలుసుకోవడం వంటి సేవలను వినియోగించుకోవచ్చు. ఏటీఎంలు సాధారణంగా పనిచేస్తాయి. అయితే చెక్ క్లియరింగ్, డ్రాఫ్ట్ జారీ వంటి కౌంటర్ సేవలు అందుబాటులో ఉండవు.

Tags:    

Similar News