Oppo Enco Air 5 Pro: ఒప్పో నుంచి సరికొత్త 'Oppo Enco Air 5 Pro' లాంచ్.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే! ధర ఎంతో తెలుసా
Oppo Enco Air 5 Pro: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో, తన నెక్స్ట్ జనరేషన్ TWS ఇయర్‌బడ్స్ ఎన్‌కో ఎయిర్ 5 ప్రోను అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేసింది.
Oppo Enco Air 5 Pro: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో, తన నెక్స్ట్ జనరేషన్ TWS ఇయర్‌బడ్స్ ఎన్‌కో ఎయిర్ 5 ప్రోను అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేసింది. గత ఏడాది వచ్చిన ఎయిర్ 4 ప్రోకు అప్‌గ్రేడ్‌గా వచ్చిన ఈ బడ్స్‌లో అత్యాధునిక ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఇయర్‌బడ్స్ ధర, ప్రత్యేకతలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ముఖ్యమైన ఫీచర్లు ఇవే:
హై-క్వాలిటీ సౌండ్: ఇందులో 12mm డ్రైవర్లను అమర్చారు. ఇది 20Hz నుంచి 40KHz వరకు స్పష్టమైన సౌండ్‌ను అందిస్తుంది. ముఖ్యంగా LHDC 5.0 సపోర్ట్ వల్ల వైర్‌లెస్ ద్వారా కూడా హై-రెజల్యూషన్ ఆడియోను ఆస్వాదించవచ్చు.
నాయిస్ క్యాన్సిలేషన్: బయటి శబ్దాలు వినిపించకుండా 55dB వరకు నాయిస్ క్యాన్సిలేషన్ సదుపాయం ఉంది. యూజర్లు తమ అవసరాన్ని బట్టి అడాప్టివ్ మోడ్, ట్రాన్స్‌పరెన్సీ మోడ్‌లకు సులభంగా మారిపోవచ్చు.
బ్లూటూత్ 6.0 & గేమింగ్: లేటెస్ట్ బ్లూటూత్ 6.0 టెక్నాలజీతో ఇది వస్తోంది. గేమర్స్ కోసం ప్రత్యేకంగా 47ms లో-లేటెన్సీ మోడ్‌ను ఇచ్చారు, దీనివల్ల గేమ్ ఆడేటప్పుడు సౌండ్ సూపర్‌గా వినిపిస్తుంది.
బ్యాటరీ లైఫ్: ఒక్కసారి ఛార్జ్ చేస్తే (ANC ఆఫ్‌లో ఉంటే) ఇయర్‌బడ్స్ 13 గంటల వరకు పనిచేస్తాయి. ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 54 గంటల సుదీర్ఘ బ్యాటరీ లైఫ్‌ను ఇది ఆఫర్ చేస్తోంది.
కాల్ క్వాలిటీ: కాల్స్ మాట్లాడేటప్పుడు స్పష్టత కోసం మూడు మైక్రోఫోన్లతో కూడిన నాయిస్ క్యాన్సిలేషన్ సిస్టమ్ ఇందులో ఉంది.
ధర:
చైనా మార్కెట్లో ఒప్పో ఎన్‌కో ఎయిర్ 5 ప్రో ధర CNY 329 (సుమారు రూ.4,300). ఇది మూన్‌స్టోన్ వైట్, మిడ్‌నైట్ బ్లాక్ కల్లర్స్‌లో అందుబాటులో ఉంది. మార్చి 2 నుంచి అక్కడ అమ్మకాలు స్టార్ట్ కానున్నాయి. ప్రస్తుతానికి ఇండియా లాంచ్ గురించి కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినా, ఒప్పోకు ఇక్కడ ఉన్న క్రేజ్ దృష్ట్యా త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ధర కూడా రూ.4,500 లోపే ఉండవచ్చని అంచనా. మీరు గనుక మంచి నాయిస్ క్యాన్సిలేషన్, ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఉన్న ఇయర్‌బడ్స్ కోసం చూస్తుంటే, ఒప్పో ఎన్‌కో ఎయిర్ 5 ప్రో ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుందని చెబుతున్నారు.