Bluetooth Speaker: రూ.699 కే అదిరిపోయే బ్లూటూత్ స్పీకర్.. ఫీచర్లు చూశారా!
Bluetooth Speaker: తక్కువ బడ్జెట్‌లో మంచి పోర్టబుల్ స్పీకర్ కోసం చూస్తున్నారా. అయితే మీరు 'హామర్ వేవ్' గురించి తెలుసుకోవాల్సిందే.
Bluetooth Speaker: రూ.699 కే అదిరిపోయే బ్లూటూత్ స్పీకర్.. ఫీచర్లు చూశారా!
Bluetooth Speaker: తక్కువ బడ్జెట్‌లో మంచి పోర్టబుల్ స్పీకర్ కోసం చూస్తున్నారా. అయితే మీరు 'హామర్ వేవ్' గురించి తెలుసుకోవాల్సిందే. 'షార్క్ ట్యాంక్ ఇండియా' ప్రోగ్రామ్ ద్వారా పాపులర్ అయిన ఈ బ్రాండ్.. ఇప్పుడు మార్కెట్లో boAt వంటి కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది. దీని ప్రత్యేకతలు, ధర మొదలైన విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఈ స్పీకర్ చూడటానికి పాత కాలపు రేడియో మోడల్‌లో ముచ్చటగా ఉంటుంది. వాల్యూమ్, మోడ్ మార్చడం, ప్లే, పాజ్ బటన్లు అన్నీ పైభాగంలో ఇచ్చారు. బటన్ల క్వాలిటీ బాగుందని వాడిన వాళ్లు చెబుతున్నారు. దీని బ్యాక్ సైడ్‌లో USB పోర్ట్, మెమరీ కార్డ్ స్లాట్, లేటెస్ట్ టైప్-C ఛార్జింగ్ పోర్ట్ ఉన్నాయి. దీనికి మ్యాట్ ఫినిషింగ్‌తో ప్లాస్టిక్ బాడీ ధృడంగా ఉంది. దీనికి ఒక హ్యాంగింగ్ లూప్ కూడా ఉండటంతో ఎక్కడికైనా సులభంగా పట్టుకెళ్లొచ్చు.
సౌండ్ ఎలా ఉందంటే..
ఇది 10W సౌండ్ అవుట్‌పుట్‌ను ఇస్తుంది. తక్కువ లేదా మీడియం వాల్యూమ్‌లో విన్నప్పుడు సౌండ్ క్లారిటీ చాలా బాగుందని చెబుతున్నారు. ఒక మామూలు గదిలో వాడుకోవడానికి ఇది సరిపోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఫుల్ వాల్యూమ్ పెడితే సౌండ్‌లో క్లారిటీ కొంచెం తగ్గుతుందన్నారు. కాబట్టి దీన్ని పార్టీ స్పీకర్‌లా కాకుండా, వ్యక్తిగత అవసరాలకు వాడుకోవడం ఉత్తమం అని చెబుతున్నారు. దీనికి 1200mAh బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 4 నుంచి 5 గంటల పాటు నాన్ స్టాప్‌గా పాటలు వినవచ్చు. బడ్జెట్ స్పీకర్లలో ఈ స్థాయి బ్యాటరీ లైఫ్ ఉండటం విశేషం అనే చెబుతున్నారు.
ధర, ఫీచర్లు ఇవే..
కంపెనీ వెబ్‌సైట్‌లో దీని ధర కేవలం రూ.699 మాత్రమే ఉంది. ఇందులో బ్లూటూత్‌తో పాటు FM మోడ్ కూడా ఉంది, ఇది రేడియో ప్రియులకు మంచి ఆప్షన్ అని చెబుతున్నారు. మీరు తక్కువ ఖర్చులో, స్టైలిష్‌గా ఉండి, టైప్-సి ఛార్జింగ్ సపోర్ట్ చేసే స్పీకర్ కావాలనుకుంటే 'హామర్ వేవ్' మంచి ఎంపిక అని అంటున్నారు. రూ.700 లోపు ఇది ఒక వ్యాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.