Anakapalle: మాటూరులో రూ.కోట్ల అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే కొణతాల

Anakapalle: అనకాపల్లి మండలం మాటూరు గ్రామంలో అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కొణతాల పరిశీలించారు. రూ.1.35 కోట్లతో శివాలయ అభివృద్ధి పనులకు అనుమతులు వచ్చాయన్నారు.

Update: 2026-08-07 10:46 GMT

Anakapalle: మాటూరులో రూ.కోట్ల అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే కొణతాల

మాటూరు గ్రామంలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ

అనకాపల్లి, ఆగస్టు 7: అనకాపల్లి నియోజకవర్గం, అనకాపల్లి మండలం మాటూరు గ్రామంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పరిశీలించారు. గ్రామంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.

గ్రామాభివృద్ధిలో భాగంగా డీఎంఎఫ్ నిధుల నుంచి సుమారు రూ.4 కోట్లతో, పంచాయతీ నిధుల నుంచి రూ.70 లక్షలు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్) నిధుల నుంచి రూ.16.5 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, చెరువు నిర్మాణం తదితర అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. పనుల నాణ్యత, పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

అలాగే ఎండోమెంట్స్ శాఖ ఆధ్వర్యంలో సుమారు రూ.1.35 కోట్ల వ్యయంతో చేపట్టనున్న శివాలయ అభివృద్ధి, నూతన నిర్మాణ పనులకు పరిపాలనా ఆమోదం లభించినట్లు తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న ఆలయ నిర్మాణ పనులకు ముందు స్వామివారిని దర్శించుకుని, ఆలయ ప్రాంగణం మరియు పరిసర ప్రాంతాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లకు పనులను వెంటనే ప్రారంభించి, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. గ్రామాభివృద్ధికి అవసరమైన ప్రతి పనిని ప్రాధాన్యతగా చేపట్టి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తెలిపారు.

Tags:    

Similar News