Chodavaram: రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Chodavaram: అనకాపల్లి జిల్లా రావికమతం మండలంలో 2,862 మంది రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు. భూ సమస్యలపై కీలక వ్యాఖ్యలు.

Update: 2026-08-05 14:14 GMT

Chodavaram: రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

చోడవరం: అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమతం మండలం మేడివాడ , దొండపూడి గ్రామంలో చోడవరం శాసనసభ్యులు శ్రీ KSNS రాజు చేతుల మీదుగా సుమారు 2862 రైతులకు ఘనంగా పాస్ బుక్ పంపిణీ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాపు కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ రాజాన కొండ నాయుడు , బిజెపి పార్టీ మండల పార్టీ గుట్టల చిన్న పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీ KSNS రాజు గారు మాట్లాడుతూ గ్రామంలో నిర్వహించిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ, భూ రికార్డుల్లో గతంలో జరిగిన లోపాలను సరిదిద్ది రైతులకు ఖచ్చితమైన హక్కు పత్రాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గతంలో భూముల వివరాల్లో పేర్లు, సర్వే నంబర్లు, విస్తీర్ణం వంటి అంశాల్లో జరిగిన తప్పుల వల్ల అనేక మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.

భూముల విలువ పెరగడంతో కొందరు అక్రమాలకు పాల్పడి రైతులను నష్టపరిచారని, ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేందుకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర రీసర్వే చేపట్టిందని వివరించారు. భూ కబ్జాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటూ, భూ రికార్డులను పారదర్శకంగా రూపొందించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

గతంలో అమలులో ఉన్న ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసి, భూ కబ్జాదారులపై క్రిమినల్ చర్యలు తీసుకునేలా కొత్త విధానాలు అమల్లోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.

డీ-ఫారం పట్టాలు, 22A జాబితాలో ఉన్న భూములు, బ్యాంకు రుణాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. కేసు వారీగా పరిశీలించి అర్హులైన రైతులకు ఉపశమనం కల్పించే చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు, వీఆర్వోలు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచిస్తూ, నిర్లక్ష్యం లేదా అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రీ-సర్వేలో ప్రతి అంశాన్ని నిష్పక్షపాతంగా పరిశీలించి రైతులకు న్యాయం జరిగేలా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావిస్తూ, సామాజిక భద్రతా పెన్షన్ల పెంపు, తల్లికి వందన పథకం, పోలవరం ప్రాజెక్టు పురోగతి, రాజధాని నిర్మాణం వంటి అంశాలను వివరించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగుతున్నాయని చెప్పారు.

ఈ కార్యక్రమంలో MRO గారు,MPDO గారు,Ex సర్పంచ్ శివ,రామారావు,చోడవరం మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు సాంబ శివ, కన్నంపేట ex ఎంపీటీసీ బంటు శ్రీను,మండల itdp అధ్యక్షులు గల్లా నాన్ బాబు ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళలు పాల్గొన్నారు.

Tags:    

Similar News