Parawada: పరవాడలో మెగా డీఎస్సీ అక్రమాలపై వైయస్సార్‌సీపీ దీక్ష
Parawada: అనకాపల్లి జిల్లా పరవాడలో మెగా డీఎస్సీ అక్రమాలను నిరసిస్తూ వైయస్సార్‌సీపీ రిలే నిరాహార దీక్ష. విద్యామంత్రి నారా లోకేష్ రాజీనామాకు డిమాండ్.
Parawada: పరవాడలో మెగా డీఎస్సీ అక్రమాలపై వైయస్సార్‌సీపీ దీక్ష
పరవాడ: కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లొకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మేజర్ పంచాయతీ పరవాడ గ్రామంలో సంతబయులు వద్ద వై.సి.పి రాష్ట్ర కార్యదర్శి, మాడుగుల నియోజకవర్గ పరిశీలికులు పైల శ్రీనివాసరావు గారు, పరవాడ జడ్పీటీసీ పి.ఎస్ రాజు గారి నాయకత్వంలో మండల పార్టీ అధ్యక్షులు కోన రామారావు అధ్యక్షతన రిలే నిరాహార దీక్షచేశారు.
ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా పెందుర్తి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గం సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్ రాజ్ గారు పాల్గొని దీక్ష లో కూర్చున్న వాళ్ళకి పూలమాలలు వేసి సంఘీభావం తెలిపారు. అలాగే ఈ దీక్ష శిబిరాన్ని అనకాపల్లి జిల్లా బొడ్డేడ ప్రసాద్ గారు వీరికి మద్దతుగా నిలిచి సంగిభావం తెలిపారు.
అలాగే రాష్ట్ర కార్యదర్శి గండిరవి చోడవరం నియోజకవర్గ పరిశీలకులు దీక్షకు సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా అదీప్ రాజ్ గారు మాట్లాడుతూ రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేదలు రైతులు రోజు వారీ కూలీలు తమ పిల్లలను ఎంతో కష్టపడి చదివించుకుంటున్నారని వారి కలలను కూటమి ప్రభుత్వం అక్రమాలతో తుంగలో తొక్కుతోందని అదీప్ రాజ్ గారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలకు మెరిట్ విద్యార్థులకు జరిగిన అన్యాయానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారని కష్టపడి చదివించిన తల్లిదండ్రులు తమ పిల్లలు టీచర్ డాక్టర్ లాయర్ ఇంజనీర్ సైంటిస్ట్ లేదా చార్టర్డ్ అకౌంటెంట్ కావాలని తల్లిదండ్రులు లక్షల రూపాయలు అప్పులు చేసి చదివిస్తున్నారని ఎంతో పారదర్శకంగా జరగాల్సిన డీఎస్సీ ప్రక్రియను ఈ ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టిం చిందని విమర్శించారు.
క్వశ్చన్ పేపర్ ఆన్సర్ షీట్ మార్కుల విడుదల ప్రక్రియల్లో పారదర్శకత లోపించి విద్యార్థుల భవిష్యత్తును అడుక్కునే స్థితికి దిగజార్చారని ఆరోపించారు. రాష్ట్రంలో డిస్టింక్షన్ వచ్చి ప్రథమ ర్యాంకులు సాధించిన అర్హులైన విద్యార్థులను పక్కన పెట్టి అధికార పార్టీ కి చెందిన వ్యక్తులు తమ దగ్గర పనిచేసే వారికి అనుకూలంగా వ్యవహరించారన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా జీవో రాకముందే రెండేళ్ల ముందే స్పోర్ట్స్ కోటా పేరిట సంస్థలను సృష్టించి నకిలీ సర్టిఫి కెట్లతో ఉద్యోగాలు కట్టబెట్టారని ధ్వజమెత్తారు. ప్రశ్నించిన అభ్యర్థులను బెదిరింపులకు గురిచేయడం వల్లే ఎంతో మంది అభ్యర్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అక్రమాలపై బాధ్యత వహించాల్సిన మంత్రి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
నిరుద్యోగులు విద్యార్థుల తరపున వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మ రియు వివిధ ప్రజా సంఘాల మద్దతుతో ర్యాలీలు ధర్నాలు నిర్వహించనున్నామని నీట్ నుంచి డీఎస్సీ వరకు జరిగిన అన్ని పరీక్షల అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి మెరిట్ సాధించిన పేద విద్యార్థులకు వెంటనే న్యాయం చేయాలని నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు అదీప్ రాజ్ అన్నారు.
ఈ సాయంత్రం వైసిపి రాష్ట్ర కార్యదర్శి పైల శ్రీనివాసరావు, పరవాడ జడ్పిటిసి పి.ఎస్ రాజు దీక్ష జిల్లా అధికార ప్రతినిధి చుక్క రామునాయుడు లు శిబిరంలో కూర్చున్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో వైస్ Mpp లు బంధం నాగేశ్వరరావు బూస అప్పలరాజు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు పేదిశెట్టి శేఖర్ , మండల యువజన విభాగ అధ్యక్షుడు బండారు శ్రావణ్, సర్పంచ్ లు వెన్నల అప్పారావు పల్లా అప్పారావు(కభాడి) MPTC లు
చప్పా ప్రభాసన్యాసిరావు గెడ్డం పుష్పా చంద్రరావు బొద్దపు చిన్నారావు ఐడి బాబు మెంటి మహేస్ అప్పికొండ మహాలక్ష్మీ నాయుడు సుందరపు అప్పారావు గెంజిసురేష్ కర్రి నర్శింగరావు సాలాపు సంతోష్ నందవరపు శ్రీను వాస్ స్పీడ్ మసేను బొబ్బిలి సత్తిబాబు వెన్నల సింహద్రి బత్తి అప్పారావు పైల హరీష్ ముత్యాలనాయుడు మాష్టర్ కండక్షర్ అప్పల నాయుడు దాదానాయుడు
బండారు క్రిష్ణబాబు పల్లా గోవింద్ కె వి రాజు పాసిల దివ్య ఈదలపాక సన్యాసిరావు పైల పైడం నాయుడు మాసవరపు అప్పారావు ఉమామహేశ్వరి సత్తీలు బుజ్జి అప్పారావు జమ్ముల అశోక్ బొండా సతీస్ బాండా కేశవ పైల రేగారావు నల్లమసేన్ చుక్క కాసి బోద్దపు వెంకట రమణ సురడ తాతారావు దాలయి సత్యనారాయణ కన్నూరు నేస్తాలు సునీల్ జోషి వై.సి.పి ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.