Anakapalle: శ్రీ పొన్నమండ లక్ష్మణస్వామి జయంతిని చేసిన అనకాపల్లి సీపీ!

Anakapalle: అనకాపల్లి ఎస్పీ కార్యాలయంలో పొన్నమండ లక్ష్మణస్వామి జయంతి. ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాలతో లక్ష్మణస్వామి చిత్రపటానికి నివాళులర్పించిన ఏఎస్పీ మోహనరావు.

Update: 2026-08-07 07:48 GMT

Anakapalle: శ్రీ పొన్నమండ లక్ష్మణస్వామి జయంతిని చేసిన అనకాపల్లి సీపీ!

శ్రీ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతిని ఘనంగా నిర్వహించిన అనకాపల్లి జిల్లా పోలీసులు

అనకాపల్లి, ఆగస్టు 7: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వేడుకగా ప్రకటించిన శ్రీ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతి సందర్భంగా అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా పోలీసు అధికారులు ఘన నివాళులర్పించారు.

జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్. మోహనరావు ఆధ్వర్యంలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని శ్రీ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ ఎల్. మోహనరావు మాట్లాడుతూ, శ్రీ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ వెనుకబడిన వర్గాల సామాజిక, విద్యా, ఆర్థిక అభ్యున్నతికి విశేష కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, విద్యావేత్త, సామాజిక చైతన్యవేత్త అని కొనియాడారు. సమాజంలో సమానత్వం, విద్యకు ప్రాధాన్యత, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ప్రతి ఏడాది ఆగస్టు 7వ తేదీని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక వేడుకగా నిర్వహించడం గర్వకారణమని తెలిపారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీఐలు బాల సూర్యరావు, లక్ష్మి, సతీష్, రమేష్, రమణయ్య, ఎస్సైలు ప్రసాద్, అంజిబాబు, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొని శ్రీ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

Tags:    

Similar News